WGL: నల్లబెల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా వైద్యాధికారి డా.సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ మేరకు సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, మందుల స్టాక్, ఆరోగ్య సేవల అందించే విధానాన్ని ఆయన పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేయాలని, రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.