MDCL: కాప్రా, ఉప్పల్ సర్కిల్ చర్లపల్లి డివిజన్ ప్రాంతాలలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ల కోసం ఒక్కో టాయిలెట్ రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కానీ.. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అనేక చోట్ల మూలకు పడ్డాయి. మిగతా ప్రాంతాల్లోనూ పబ్లిక్ టాయిలెట్లు సరిగ్గా నడవటం లేదని అక్కడ ప్రజలు తెలిపారు. అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.