TG: ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి, అతని భార్యకి కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ కేసు కోసం రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించింది. అలా.. భార్య అందించిన సమాచారంతో పోలీసులకు రవి చిక్కాడు. కాగా, అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.