HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే ఉత్సాహంతో రాబోయే అన్ని ఎన్నికల్లో గెలవాలని భావిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించగా.. దాదాపు 40 మందికిపైగా కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి చేరారు. దీంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత బలం పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమచారం.