ATP: నగరంలోని సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హైస్కూల్, ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో ఖాళీల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సెయింట్ మేరీస్ ఎయిడెడ్ హైస్కూల్లో మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.