కోల్కతా టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 93/7 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ముగించిన సౌతాఫ్రికా 63 రన్స్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బవుమా(29*), బాష్(1) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159, భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తొలి టెస్ట్ ఈ రోజే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.