WNP: పానగల్ మండలం కేతేపల్లి భగత్ సింగ్ నగర్లో R&B రోడ్డు కింద ఉన్న వాటర్ పైప్లైన్ లీకేజీతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీ నీరు రోడ్డుపై నిలిచి గుంతలు ఏర్పడుతున్నాయని, అంతేగాక ఆ నీరు చెత్తలో చేరి మురిగి దుర్వాసన వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే లీకేజీని బాగు చేయాలని కోరుతున్నారు.