ASF: సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు డిజిటల్ సేవలు అందించనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ SE శేషారావ్ ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఫీచర్లతో TGNPDCL యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. వాట్సాప్ లో 7901628348 కు ‘హాయ్’ అని చాట్ చేసి వివరాలు నమోదు చేస్తే వినియోగదారుని సర్వీస్ వివరాలు వస్తాయని పేర్కొన్నారు. అందులో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు