ప్రకాశం: రాచర్లలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఎస్సై కోటేశ్వరరావు ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి హెచ్చరించారు. అనంతతరం మైనర్లపై నిఘ పేట్టకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైతే వాహన యజమానికి కూడా శిక్ష పడుతుందని SI తెలిపారు.