తెలంగాణ షూటర్ ఇషా సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. షూటింగ్లో పట్టుదలతో సాధన చేస్తున్న ఇషా సింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని.. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.