AP: రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. నిష్పక్షపాత జర్నలిజానికి ఆయన నూతన ప్రమాణాలు ఏర్పరిచారని కొనియాడారు. ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడని పేర్కొన్నారు. వ్యాపారాల్లోనూ ప్రజాహితం, విలువలు, నైతికతను చూపిన అరుదైన దూరదృష్టి కలిగిన వ్యక్తి అని కొనియాడారు.