SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జనరేటర్‌ను ఏర్పాటు చేసి కొన్ని నెలలు గడుస్తున్న వాడుకలోకి తీసుకు రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. సుమారు రూ. 34 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించి, జనరేటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి, జనరేటర్‌ను వెంటనే వాడుకులోకి తీసుకురావాలని కోరుతున్నారు.