AP: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్తవలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. విశాఖలో అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడారు. జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. విశాఖ మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.