GNTR: కొల్లిపర మండలం జముడుబాడు పాలెం గ్రామానికి చెందిన లావణ్య(20) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు చౌడవరం సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఆమె అనారోగ్య సమస్యల వలన ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.