ELR: సారా కేసుల్లో పాత ముద్దాయిలైన వేములపల్లికి చెందిన కంభం కృష్ణ, దంపనబోయిన నరసింహంలను శనివారం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. వీరిని తహసీల్దార్ బైండోవర్ చేశారు. సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.