ASF: ఈనెల 17 నుంచి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో L1, 2, 3 సిస్టం ఎత్తివేయాలని, రైతులకు అందుబాటులో ఉన్న మిల్లుల్లో కొనుగోళ్ళు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కొనుగోళ్లు నిలిపివేశామన్నారు.