NLG: నర్సింగ్ భట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని తిరుమల అంకిత రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ నెల 14న మర్యాలలో జరిగిన అండర్-14 ఎస్టీఎఫ్ సెలెక్షన్స్‌లో అంకిత అద్భుత ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. ఈ సందర్భంగా అంకితను ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధిని, విద్యార్థులు అభినందనలు తెలిపారు.