శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి మెమొంటోను అందజేశారు. విశాఖపట్నంలో ఈనెల 14, 15 తేదీలలో జరిగిన CII సదస్సులో విశేష సేవలు అందించినందుకు గాను నిన్న రాత్రి సత్కరించారు. ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యేలా.. ప్రజలకు చేరే విధంగా కృషి చేసినందుకుగాను ఈ గుర్తింపు లభించింది.