TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు లక్ష కుంకుమార్చన చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.