NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగులుకు ఐదు నెలల నుంచి వేతనాలు లేవని తెలిపారు. వేతనాలు ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని, కుటుంబ పోషణకు తీవ్ర ఆటంకంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.