NGKL: కల్వకుర్తి పట్టణ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాణ్యతగా, సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.