BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులతో పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కార్తీక మాసం, ఆదివారం సెలవు రోజు కావడంతోనే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. క్యూలైన్లలో భక్తులు క్రమశిక్షణతో వేచి ఉండి, స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.