NGKL: కల్వకుర్తి మండలం రఘుపతి పేట నుంచి తెలకపల్లికి బస్సు సర్వీసులు ఈరోజు ఉదయం తిరిగి పునః ప్రారంభమయ్యాయి. గత 15 రోజుల క్రితం భారీ వర్షానికి రఘుపతి పేట సమీపంలో ఉన్న దుందుభి నది ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నది ఉదృతి తగ్గినందున బస్సులను యాదావిధిగా నడిపిస్తున్నట్లు కల్వకుర్తి ఆర్టీసీ డీఎం సుభాషిణి తెలిపారు.