ATP: హిందూపురం YCP కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై అనంత తీవ్రంగా మండిపడ్డారు. హౌస్ అరెస్ట్ అంటూ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. చివరకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన హిందూపురం వెళ్లారు.