ఖమ్మం 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేందర్ మాతృమూర్తి ప్రమీలారాణి శుక్రవారం కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నిన్న వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమీలారాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.