అన్నమయ్య: మదనపల్లి మండలం CTM రైల్వే స్టేషన్ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్న ఉద్యోగి అనిల్ కుమార్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తన స్వగ్రామమైన బీహార్‌లో ఎన్నికలు జరుగుతుండడంతో ఓట్లు వేసేందుకు ఈనెల 7న వెళ్ళాడు. తిరిగి శనివారం వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి బీరువాలో ఉన్న రూ. 5 లక్షల విలువ చేసే బంగారం రూ. 2 లక్షల నగదు దోచుకెళ్లారని బాధితుడు తెలిపాడు.