KDP: మున్సిపల్ ఎగ్జిబిషన్ డబ్బు చెల్లింపు విషయంలో టీడీపీ నేత కొండారెడ్డి చేసిన ఆరోపణలకు వైసీపీ నేత రాచమల్లు శనివారం ప్రొద్దుటూరులో స్పందించారు. 2014 -19 వరకు వైసీపీ హయాంలో చెల్లించని ఎగ్జిబిషన్ జీఎస్టీ రూ.1,500,000 చెల్లించామని తెలిపారు. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన జీఎస్టీ రూ. 6,500,000 చెల్లిస్తారా అంటూ రాచమల్లు కొండారెడ్డికి సవాల్ విసిరారు.