VSP: జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGHకి తరలించామని తెలిపారు.