చలికాలంలో చర్మ సమస్యలను తగ్గించుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. సువాసనగల సబ్బులు వాడటం తగ్గించాలి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పెదవులకు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అంతేకాదు రోజుకు సరిపడా నీరు త్రాగాలి. పండ్లు, కూరగాయలు తినాలి.