VSP: జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.