ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టారు. 4 అంతస్తుల వరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించి, వాటిని తొలగించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే నిర్మాణాలను కూల్చివేస్తామని కమిషనర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.