CTR: UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం BC స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు BC సంక్షేమశాఖ అధికారి రబ్బానీబాషా పేర్కొన్నారు. SC,ST,BC అభ్యర్థులకు విజయవాడలో శిక్షణ ఉంటుందని, అర్హత కలిగిన వారు ఈ నెల 17 నుంచి 25 లోగా కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు ఈ నంబర్‌ను 9177429494 సంప్రదించాలని తెలిపారు.