SRD: నూతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ఇసుక బావిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మల్లన్న స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన గదులు, షెడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.