SRD: కంగ్టి మండలం జంగి (బీ) UPS బడికి ఫ్రంట్ గేటు ఉన్నా దానికి తాళం ఎందుకు వేయడం లేదని గ్రామస్తులు ఆదివారం ఆవేదనతో తెలిపారు. నేడు సెలవు దినం పూట గేటుకు తాళం వేయక తెరచి ఉంది. దీంతో పశువులు, పందులు చొరబడి అపరిశుభ్రతకు గురి చేస్తున్నాయన్నారు. స్థానిక HM కు పలుమార్లు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో MEO చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.