NLG: లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని మండల న్యాయ సేవాసమితి సంస్థ అధ్యక్షులు, జడ్జి కే అనిత అన్నారు. నిన్న నిర్వహించిన జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 3,078 కేసులు పరిష్కారమైనట్లు ఆమె తెలిపారు. కక్షిదారులు, ఫిర్యాదుదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే వేగంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.