కృష్ణా: తోట్లవల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వీరంకి సీతారాంబాబు ఆకస్మికంగా మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా, బీసీ విభాగంలో పలు బాధ్యతలకు ఆయన విధులు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు శోకసంద్రంలోకి మునిగిపోయారు.