హనుమాన్ రాజమౌళితో ఈ మూవీ చేయించారని ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ వారణాసి ఈవెంట్లో అన్నారు. అయితే చిన్న టెక్నీకల్ ఇష్యూ వల్ల వీడియో ప్లే అవ్వడం ఆలస్యం అయింది. దీంతో రాజమౌళి.. ‘నాకు దేవుడిపై నమ్మకం లేదు.. హనుమాన్ నా వెనుక ఉంటారని నాన్న చెప్పారు. ఇదేనా నడిపించడం’ అని అన్నారు. దీంతో ఈ చిన్న విషయం పట్టుకుని రాజమౌళి అలా అనడం కరెక్ట్ కాదని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.