KMM: ఇందిరా మహిళా డెయిరీ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎంపీడీవోలకు ఆదేశించాలు జారీ చేశారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పశువుల యూనిట్ల అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 5 వేల మంది లబ్ధిదారులకు 10 వేల పశువుల పంపిణీ కోసం సమగ్ర ప్రణాళికను స్పష్టం చేశారు.