AP: టీటీడీ నెయ్యి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నెల 20న టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని వైవీకి ఇప్పటికే నోటీసులు అందాయి. అయితే, ఈ నెల 17 నుంచి అందుబాటులో ఉంటానని వైవీ పేర్కొన్నారు. విచారణకు తాను నేరుగా హాజరుకాలేనని వెల్లడించారు. దీంతో వైవీ ఇంటికే వెళ్లి విచారించాలని సిట్ నిర్ణయం తీసుకుంది.