ELR: లింగపాలెం మండల విద్యాశాఖ అధికారిగా కె. వెంకట దుర్గారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రామారావు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో వెంకట దుర్గారావు చేరారు. నూతన విద్యాశాఖాధికారికి ఎంఈవో 2 రవీంద్ర సాదర స్వాగతం పలికారు. విద్యాభివృద్ధికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.