ప్రకాశం: కనిగిరి పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చిలకపాటి లక్ష్మయ్య అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి వైద్యశాలలో లక్ష్మయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు.