ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను చెరువులు, కాల్వలు సహా వివిధ నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సమృద్ధిగా అందించడంతో పాటు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశారు.