అక్కినేని నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ ఈ నెల 14న రీ-రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.