SKLM: బెంగళూరుకు వెళ్లే జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం – బెంగుళూరు(08553/54) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 21న శుక్రవారం ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు బెంగళూరు స్టేషన్కు చేరుకుంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.