MNCL: బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం మంచిర్యాలలోని బాయ్స్ హైస్కూల్ మైదానంలో రన్ ఫర్ జస్టిస్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్, రంగు రాజేశం మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.