రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టీ20 టోర్నీలో ఆసక్తికర పోరుకు వేళైంది. జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత్-ఎ జట్టు ఇవాళ పాకిస్తాన్ షహీన్స్ జట్టుతో తలపడనుంది. కళ్లన్నీ వైభవ్ సూర్యవంశీ పైనే. భారత్ తొలి మ్యాచ్‌లో అతడు UAEపై చెలరేగిపోయాడు. సిక్స్‌లో మోత మోగించిన వైభవ్.. 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయరు.