W.G: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు పై ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీ హర్ష తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి కుష్టు వ్యాధిగ్రస్థుల గుర్తింపుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి అనుమానిత వ్యాధిగ్రస్థులను గుర్తించాలన్నారు.