KNR: కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన (15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.