NLR: ఉదయగిరి విద్యుత్ శాఖ డీఈఈగా కొణిదల సుధీర్ చౌదరి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన నెల్లూరులో ఏఈగా పని చేస్తూ, ప్రమోషన్ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.