బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి కలయికతో మరో సినిమా పట్టాలెక్కనుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించే ఈ సినిమా ఈ నెలాఖరున పూజా కార్యక్రమం జరుపుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవర్ఫుల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న ఈ మూవీలో బాలయ్య 2 భిన్న షేడ్స్‌లో కనిపిస్తారని టాక్.